రాజాబాబుకు చక్రాల కుర్చీ… కొత్త ఆశాకిరణం--ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సంస్థల సమితి చిన్న సహాయం… ఒక కుటుంబానికి పెద్ద ఊరట, ఆనందం


విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని-మానవత్వం, సేవాభావం, కరుణకు ప్రతీకగా ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సంస్థల  సమితి ఆధ్వర్యంలో అచ్చుతాపురం(SEZ) కాలనీ సమీపంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన దినసరి కూలీ  శ్రీ చిన  అప్పారావు కుమారుడు, శ్రీ అండే రాజాబాబుకు చక్రాల కుర్చీని అందజేశారు.

రాజాబాబు చిన్ననాటి నుంచే పోలియో కారణంగా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. రోజువారీ అవసరాల కోసం కూడా ఇతరుల సహాయం అవసరమవుతున్న నేపథ్యంలో అందజేసిన ఈ చక్రాల కుర్చీ ఆయనకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఇకపై మరింత సులభంగా కదలడానికి, తన రోజువారీ పనులను కొంత స్వతంత్రంగా చేసుకోవడానికి ఇది తోడ్పడనుంది.

ఏళ్లుగా తమ కుమారుడి ఇబ్బందులను చూస్తున్న రాజాబాబు వృద్ధ తల్లిదండ్రులకు ఈ సహాయం ఎంతో ఆనందాన్ని, ఊరటను కలిగించింది. “మాకు ఇది కేవలం చక్రాల కుర్చీ కాదు… మా బిడ్డకు వచ్చిన కొత్త ఆశ” అన్న భావన వారి ఆనందంలో స్పష్టంగా కనిపించింది. గ్రామస్థులు కూడా ఉక్కునగరం సమితికి తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి అభ్యర్ధన మేరకు ఈ చక్రాల కుర్చీని AMTZ (Andhra Med Tech Zone) నుంచి  ఉక్కునగరం DPS  స్కూలు లో పనిచేస్తున్న  శ్రీమతి టి.ఎన్. నాగిని గారు    అందించిన ఉదారమైన ఆర్థిక సహకారంతో సమకూర్చారు. 

ఈ సేవా కార్యక్రమానికి హృదయపూర్వకంగా సహకరించిన శ్రీమతి టి.ఎన్. నాగిని గారికి శ్రీ డి ఏ వి సన్యాసిరాజు , కన్వీనర్,  ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి  తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

“మానవ సేవే మాధవ సేవ” అనే స్ఫూర్తితో, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా మార్గం. ప్రేమతో అందించే చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో గొప్ప మార్పుకు, కొత్త ఆశకు నాంది కావచ్చు.

రాజాబాబుకు అందించిన ఈ చక్రాల కుర్చీ కేవలం కదలికకు సాధనం మాత్రమే కాదు… ఆ కుటుంబానికి ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయత, ఆశలకు ప్రతీక.


Post a Comment

0 Comments