. SRINIVAS SPL Correspondent
అమలాపురం, విశాఖ సందేసం...విద్యతోపాటు ఆత్మ రక్షణ విద్యలోనూ ప్రతిభ కనబరిచిన సర్ సివి రామన్ ( సహస్ర) విద్యార్థిని విద్యార్థులు(స్వర్ణ పతకాలతో మెరుస్తున్న సహస్ర పాఠశాల విద్యార్థులు) ఆదివారం యానంలో జరిగిన ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 కరాటే పోటీలలో సర్ .సి.వి రామన్, సహస్ర ఇంటర్నేషనల్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని బంగారు పతకాలను సాధించారు. ఈ పతకాలను సాధించిన ఎస్.తన్విక శ్రీవల్లి, బి.మోక్షిత్ సింహ, ఎస్. శ్రేయాల్, పి. దినేష్ కాంత్, ఎస్. పార్ధులను వారికి శిక్షణ ఇచ్చిన ఎస్. వెంకట్రావు , విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను,పాఠశాల డైరెక్టర్ రవణం వేణుగోపాల్, కరస్పాండెంట్ సత్య కుమార్ , ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఆరోగ్యాన్ని దృఢత్వాన్ని ఇస్తాయన్నారు. తమ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో కూడా విజయాలు సాధించడం ఆనందదాయకమన్నారు.


0 Comments