అక్రమ వంతెనలు తొలగించాలని పి జి ఆర్ ఎస్ లో ఫిర్యాదు చేసిన నల్లా ఆదినారాయణ....

.         SRINIVAS SPL Correspondent 
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం అయినాపురం సెక్షన్ నుండి పెదగాడవిల్లి మీదుగా వానపల్లిపాలెం ప్రవహించే వానపల్లి పాలెం బ్రాంచ్ కాలవపై నిబంధనలకు విరుద్ధంగా, అనధికారకంగా అనేకమంది అక్రమ వంతెనలను ఏర్పాటు చేసుకున్నారని, అనుమతులు లేని వంతెనలను వెంటనే తొలగించాలని డిఆర్ఓ సుబ్బారావుకు వానపల్లి పాలెం గ్రామానికి చెందిన నల్లా ఆదినారాయణ సోమవారం పీజిఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ వంతెనలను కాలువకు ఇరువైపులా గోడలతో ఇరికించి కట్టడంతో వాటి వద్ద చెత్తాచెదారాలు పేరుకుపోయి దిగువప్రాంత రైతులకు, ప్రజలకు నీటి ఎద్దడి సమయంలో నీరు సక్రమంగా అందడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నల్లా ఆదినారాయణ కోరారు

Post a Comment

0 Comments