అమలాపురం, విశాఖ సందేసం...అడాప్ట్ ఎ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్( అమెరికా) వారి దత్తత గ్రామం వన్నె చింతలపుడి లో క్షత్రియ సేవ సమితి ఆధ్వర్యంలో డివైన్ ఐ ఫౌండేషన్, పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి, వేమగిరి (ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారి సాంకేతిక భాగస్వామ్య సంస్థ) వారి సహకారంతో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం బుధవారం నిర్వహించబడుతుందని గ్రామస్తులు ఈ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు . ఈ సందర్బంగా ఫౌండేషన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోఆర్డినేటర్ నడింపల్లి వెంకటరామరాజు మాట్లాడుతూ వన్నె చింతలపూడి క్షత్రియ కమ్యూనిటీ హాల్ నందు బుధవారం మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వన్నె చింతలపూడి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.వైద్య పరీక్షలు చేసి ఆపరేషన్లు అవసరమైన వారినివైద్య శిబిరం జరుగు రోజునే వేమగిరి ఆసుపత్రికి తీసుకువెళ్లబడుతుందని,బి.పి, షుగరు కలవారు వారి మందులు తీసుకురావలని
ఉచిత ప్రయాణము, భోజన సౌకర్యాలు కల్పించబడుతున్నారు. వైద్య శిభిరం కి వచ్చే వారు తెల్లరేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకురావలన్నారు.వివరాలు కు 9440147985 సంప్రదించాలని నడింపల్లి వెంకటరామరాజు తెలిపారు

0 Comments