విశాఖపట్నం- విశాఖ సందేశం వార్తా వాహిని- 27 9 2026 ఆదివారం సాయంత్రం 6:30 కు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రైల్వే ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో ఉన్న శ్రీ సత్య సాయి సౌధ భజన మందిరంలో విశాఖ జిల్లా సత్యసాయి సంస్థల ఆధ్యాత్మిక విభాగ జాయింట్ కోఆర్డినేటర్ శ్రీ బీవీ రమణ గారి ద్వారా ఆధ్యాత్మిక సత్సంగం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సత్సంగ కార్యక్రమంలో నామస్మరణ కలియుగ సాధన అనే అంశంపై ప్రసంగించడం జరిగినది భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలలో సాయి భక్తులందరూ భక్తి భావంతో అంకిత భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవసేవే మాధవసేవ, అన్న నానుడిని కార్యరూపం దాల్చే విధంగా కార్యక్రమాలు అంకితభావంతో నిర్వహించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి సమితి పరిధిలో ఉన్న పది భజన మండలాల సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగాన్ని భక్తిశ్రద్ధలతో వినుట జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు గారు, కన్వీనర్ శ్రీ హరిహర రావు గారు, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం మంగళహారతితో సంపూర్ణమైంది.




0 Comments