విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2026: ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల (A) సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహించిన 3 రోజుల విద్యార్థి సాంకేతిక సదస్సు 'యాక్సెస్ (ACCESS) 2K26' గురువారంతో విజయంవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా విభాగాంలో ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి (వైస్-ఛాన్సలర్) ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఉపకులపతి మాట్లాడుతూ.. వృత్తిపరమైన విజయాన్ని సాధించడంలో కెరీర్ ప్లానింగ్, నిరంతర అభ్యసనం కీలక పాత్ర పోషిస్తాయని నొక్కి చెప్పారు. విద్యార్థులు తమ ఆసక్తులను, సామర్థ్యాలను గుర్తించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు.
యాక్సెస్ 2K26 సదస్సును విజయవంతంగా నిర్వహించిన సివిల్ ఇంజనీరింగ్ విభాగాన్ని వైస్ ఛాన్సలర్ అభినందించారు. విద్యార్థుల్లో సాంకేతిక జ్ఞానం, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మరియు బృంద స్ఫూర్తిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి విద్యా, వృత్తిపరమైన మరియు పాఠ్యేతర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సివిల్ ఇంజనీరింగ్ విభాగపు హెచ్‌ఓడీ ప్రొఫెసర్ సి.ఎన్.వి. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక ఉపన్యాసాలు, పేపర్ ప్రెజెంటేషన్లు, క్విజ్, పోస్టర్ ప్రెజెంటేషన్లు, మోడల్ మేకింగ్ వంటి పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. నాలెడ్జ్ అప్‌డేట్ చేసుకోవడానికి, క్షేత్రస్థాయి పరిశీలనపై అవగాహన పెంచుకోవడానికి క్రమం తప్పకుండా ఇలాంటి సాంకేతిక వేడుకల్లో పాల్గొనాలని సూచించారు.
అనంతరం వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
యాక్సెస్ 2K26 ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని వెల్లడించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన యూనివర్సిటీ అధికారులకు, అధ్యాపకులకు, నిపుణులకు, విద్యార్థి కోఆర్డినేటర్లకు మరియు ఇతర సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ముగింపు వేడుకల్లో ప్రొఫెసర్ ఐ. శివపార్వతి, ప్రొఫెసర్ టి.వి. ప్రవీణ్, ప్రొఫెసర్ పి.వి.వి. సత్యనారాయణ, ప్రొఫెసర్ కె. శ్రీనివాసరావు, ప్రొఫెసర్ ఎస్. ఆఫీస్ శేషు తదితరులు పాల్గొన్నారు.

0 Comments