ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనం: ఎంపీ శ్రీభరత్.. టీడీపీ కార్యాలయంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు


విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2026: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్, విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ  అధ్యక్షులు చో పట్టాభిరామ్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి సీతారామసుధాకర్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, దేశానికి శ్రీ నరేంద్ర మోదీ వంటి సమర్థవంతమైన, అంకితభావంతో పనిచేసే నాయకత్వం లభించడం ఎంతో విశేషమని అన్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజా సేవలో కొనసాగుతూ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో శక్తి, నిబద్ధతతో ప్రధాని మోదీ నిరంతరం దేశ సేవకు అంకితమవుతున్నారని శ్రీభరత్ అన్నారు. రోజుకు సుదీర్ఘ సమయం పనిచేస్తూ ప్రజా సంక్షేమం, దేశ ప్రగతి కోసం శ్రమిస్తున్న తీరు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

కేంద్రంలోని కూటమి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకుంటున్నాయని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ మరిన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి సేవలందించాలని శ్రీభరత్ ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ టీడీపీ పార్లిమెంట్ అధ్యక్షులు చోడే పట్టాభి రామ్ మాట్లాడుతూ..నరేంద్రమోదీ , చంద్రబాబు లు ఆలోచనలతో రాష్ట్రం అభివృద్ధి అవుతోంది అన్నారు.  విశాఖ రైల్వే జోన్ గా చేసి, భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభించి ఉత్తరాంధ్ర కు విశాఖ కు మేలు చేసిన ప్రధాని మోదీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కోరుతున్నట్టు చెప్పారు..

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు, కూటమి పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment

0 Comments