నియోజకవర్గాల్లో మౌలిక వసతుల కల్పన కి పెద్ద పీఠ - రెండేళ్లలో అభివృద్ధి పనుల కోసం రూ.532 కోట్లు కేటాయింపు * స్పీకరు అయ్యన్న పాత్రుడు


విశాఖపట్నం విశాఖ సందేశం వార్తా వాహిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జరుగుతుందని స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు  పేర్కొన్నారు. మంగళవారం నర్సీపట్నంలో స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో జరిగిన పట్టణాల ముఖచిత్రం మారేలా  ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధి-  రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు


 శ్రీ నారా చంద్రబాబు నాయుడు చే వర్చువల్ శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండేళ్ల లో రికార్డు స్థాయిలో నర్సీపట్నం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పన కోసం రూ.532 కోట్లని ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. స్థానిక నేతలు ఈ అభివృద్ధిని ప్రజలకు చూపించాలని కోరారు. వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్  నేతృత్వంలో వి ఎం ఆర్ డి ఎ నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్  మాట్లాడుతూ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు దూసుకుపోతోందని, ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం గా పాలన సాగుతుందని పేర్కొన్నారు.  వి ఎం ఆర్ డి ఎ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు, వసతుల కల్పన కి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. 


 నర్సీపట్నం అభివృద్ధికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి సూచనల మేరకు రూ.41.50 కోట్ల వీఎంఆర్‌డీఏ నిధులు కేటాయించామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రహదారులు, కాలువలు, కల్వర్టులు, తాగునీరు, వీధి దీపాలు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వీఎంఆర్‌డీఏను పట్టణాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా చిరునామాగా మారుస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వి ఎం ఆర్ డి ఎ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.722 కోట్ల కేటాయించామని పేర్కొన్నారు. 

అనకాపల్లి జిల్లా లోని అన్ని మున్సిపాలిటీ పరిధిలో రూ .120 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు , ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ , పట్టణ పురపాలక శాఖ మంత్రి శ్రీ నారాయణ  సూచనలతో ప్రధానంగా మున్సిపాలిటీల ముఖచిత్రం మారేలా నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాజ్యసభ సభ్యులు శ్రీ చింతకాయల విజయ్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ , టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ తాతయ్య బాబు, పార్టీ పరిశీలకులు స్వామి, జనసేన ఇంచార్జి సూర్య చంద్ర, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments