సింహాచలం సింహాచలం, సెప్టెంబర్ 22, 2026శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి విచ్చేసే వృద్ధులు, దివ్యాంగ భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనం కొనుగోలుకు హైదరాబాద్‌కు చెందిన నడింపల్లి వెంకట రామకృష్ణ రాజు రూ.7 లక్షల విరాళాన్ని అందించారు.
ఈ మేరకు రూ.7 లక్షల విలువైన చెక్కును మంగళవారం ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావుకు అందజేశారు.
భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని విరాళం అందించిన నడింపల్లి వెంకట రామకృష్ణ రాజును ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు అభినందించారు. భక్తుల సేవలో భాగంగా అందించిన ఈ సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

0 Comments