సింహాచలం: 26/9/2026శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో భక్తులకు అందజేస్తున్న 'శ్రీ సింహాద్రి నాథ నిత్య అన్నప్రసాదం' పథకం పనితీరును, ప్రసాదాల నాణ్యతను ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు శనివారం ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన నేరుగా అన్నప్రసాద భవనానికి చేరుకొని, అక్కడ భోజనం చేస్తున్న భక్తుల వద్దకు స్వయంగా వెళ్లారు. భక్తులతో ముఖాముఖిగా మాట్లాడి, అన్నప్రసాదం రుచి, వడ్డింపు విధానం మరియు ఇతర ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఈవో గారు అన్నప్రసాద తయారీ వంటశాలను సందర్శించారు. అక్కడ ఆహార పదార్థాల తయారీకి ఉపయోగిస్తున్న సరుకుల నాణ్యత, వంట ప్రక్రియ, పరిసరాల పరిశుభ్రతను నిశితంగా పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదాలు ఎంతో రుచికరంగా, నాణ్యతా ప్రమాణాలతో మరియు పూర్తి పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయాలని సంబంధిత సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.ఈ తనిఖీ కార్యక్రమంలో ఈవో వెంట సహాయ కార్యనిర్వహణాధికారి పాలూరి నర్సింగరావు పాల్గొన్నారు.



0 Comments