డాక్టర్ కందుల నిర్విరామ సేవా కార్యక్రమాలు ★నవ వధువుకు బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు పంపిణీ ★వినాయక చవితి అన్నదాన కార్యక్రమాలకు, బియ్యం బస్తాలు,ఆయిల్ డబ్బాలు అందజేత ★కొనసాగుతున్న డాక్టర్ కందుల స్ఫూర్తిదాయక సేవలు ★ప్రతీ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన


శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్, విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు సేవలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.

32 వ వార్డు పరిధి మాత్రమే కాకుండా దక్షిణ నియోజకవర్గం అన్ని ప్రాంతాలలో తన సేవా కార్యక్రమాలను విస్తరించారు.

ప్రతి గడపగడపకు నేరుగా వెళ్లి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా, 24 గంటలలోనే ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు.

అటు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తూనే మరో పక్క 32వ వార్డు అభివృద్ధికి కూడా అహర్నిశలు పనిచేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో అల్లిపురం నేరెళ్ల కోనేరు ప్రాంతంలోని తన కార్యాలయంలో 36వ వార్డు రంగ రీజు వీధి ప్రాంతానికి చెందిన నవ వధువు పి.విజయకు బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ అందజేశారు.

అలాగే 32 వార్డులో  నిర్వహిస్తున్న వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి మూడు పందిళ్ల నిర్వాహకులకు బియ్యం బస్తాలు, ఆయిల్ డబ్బాలను అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు సహాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని చెప్పారు. ప్రజలకు మంచి చేసేందుకు తాను ఎంత దూరమైనా వెళ్తానని తెలియజేశారు.

దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సహకారంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

అటు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నట్లు చెప్పారు.

అలాగే 32 వార్డులోనే కాకుండా దక్షిణ నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో తన సేవా కార్యక్రమాలను నిర్విరామంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ డాక్టర్ కందుల నాగరాజు స్ఫూర్తిదాయక సేవలను కొనియాడారు.

ఇతరులకు సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.

ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఆయన సహాయ సహకారాలు అందించారని ప్రశంసించారు.

ఆయ

న ఒక గొప్ప మానవతావాదని అన్నారు.

సహాయ కోసం ఈ సమయమైనా ఆయన ఇంటి తలుపు తప్పితే ఒక అన్నలా నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి,

సహాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎస్ కే ఎమ్ ఎల్ ట్రస్టీ గరికిన ఎల్లయ్య,

 కె.కృష్ణ, పి.నీలబాబు, కె.మనోహర్,చిన్ని అప్పారావు,కె.అప్పారావు, వి.శ్రీను, సిహెచ్.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments