గౌరవ ముఖ్యమంత్రివర్యులు, పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ *ఇళ్ల పట్టాల పంపిణీతో పేదల సొంతింటి కల సాకారం* *కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ *

 


విశాఖపట్నం -పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఘన స్వాగతం పలికారు.

ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లోని హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ద్వారా ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు భరోసా కలుగుతోందని తెలిపారు.

ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

పేదల జీవితాల్లో స్థిరత్వం, భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలిపారు.

Post a Comment

0 Comments