గాయపడిన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ *మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం – బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం*

 


విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 37వ వార్డు కొత్త అగ్రహారం కాలనీలో నిన్న రాత్రి జరిగిన ఘటనలో గాయపడిన గణగాళ్ల దివ్య, గణగాళ్ల కనకమహాలక్ష్మి, గణగాళ్ల యల్లమ్మలను దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్  పరామర్శించారు.

బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు.

బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఎలాంటి ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments