. SRINIVAS SPL Correspondent
అల్లవరం, విశాఖ సందేసం.... పెట్రోల్ బంక్ వద్ద గల ప్రధాన రహదారి గుంతలు మాయంగా మారడంతో ప్రమాదలకు నిలయంగా మారిందని, ఆధామరిచమో అనంతలోకాలకే పయనం తప్పదని బీజేపీ అల్లవరం మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి ఆరోపించారు. ప్రజల ప్రాణాలంటే ఎందుకింత నిర్లక్ష్యం..ప్రమాదాలు జరగకముందే పెట్రోల్ బంక్ వద్ద ఏర్పడిన గుంతలను సరిచేయవలసిందిగా బీజేపీ అల్లవరం మండల శాఖ ద్వారా డిమాండ్ చేశారు. మొగళ్ళమూరు లోయర్ కౌస్ వద్ద పెద్ద గుంత పడడంతో అక్కడ నిర్మించిన బ్రిడ్జికీ పొంచి ఉన్న ప్రమాదం. వేగంగా వస్తున్నా భారీ వాహనాలు ఆ గుంతలో పడి ఒక్కసారి పైకి లేచి బ్రిడ్జి పై ఒక్కసారిగా కుదుపుతో ఆ ప్రాంతమంతా ప్రకాంపణలు వస్తున్నాయని భయాందోళనకు గురివుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు .. ఈ రహదారులపై పడిన గుంతలను త్వరిత్తగతిన మరమ్మతులు చేయాలనీ ప్రజలతో పాటు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు.


0 Comments