ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహించిన జంతుశాస్త్ర విభాగంసెయింట్ జోసెఫ్స్ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా జంతుశాస్త్ర విభాగం విద్యార్థులు గుండె నిర్మాణం, గుండె పనితీరు మరియు హృదయ ఆరోగ్యానికి సంబంధించిన వివిధ నమూనాలను (Models) ప్రదర్శించారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సూచనలు, , గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి తదితర అంశాలను చార్టులు, పోస్టర్లు మరియు నమూనాల ద్వారా వివరించారు.అలాగే కార్యక్రమంలో భాగంగా ECG (Electrocardiogram) గురించి ప్రాథమిక అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడడంలో కీలకమైన CPR (Cardiopulmonary Resuscitation) ఎలా చేయాలి అనే అంశంపై విద్యార్థులకు ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఆకస్మికంగా గుండె ఆగిపోయిన సందర్భంలో తక్షణమే CPR అందించడం ద్వారా ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుందని వివరించారు.ఈ అవగాహనా కార్యక్రమానికి కళాశాలలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు మరియు అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో జంతుశాస్త్ర విభాగాధిపతి డా. E. హరిణి, అధ్యాపకులు డా. స్నేహ, డా. రోసినా మరియు డా. రామ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. వారి మార్గదర్శకత్వం మరియు సమన్వయంతో విద్యార్థులు చురుకుగా పాల్గొని హృదయ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.ఆరోగ్యకరమైన హృదయం – ఆరోగ్యకరమైన జీవితం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులు మరియు అధ్యాపకుల్లో హృదయ ఆరోగ్యంపై అవగాహనను పెంపొందించడంలో విజయవంతమైంది.






0 Comments