సెయింట్ జోసెఫ్స్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకులకు పురస్కారాలు


 విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవ వేడుకల్లో సెయింట్ జోసెఫ్స్ మహిళా కళాశాలకి  చెందిన ముగ్గురు విద్యార్థినులు ప్రత్యేక ప్రశంసా పురస్కారాలు అందుకున్నారు.

బిబిఎ విద్యార్థిని వై. సాయి ప్రణతి, మనోవిజ్ఞానశాస్త్ర విద్యార్థిని ఎన్.వి.ఎస్.ఎస్. లక్ష్మీ ప్రసన్న, కంప్యూటర్‌శాస్త్ర విద్యార్థిని జోష్నా ఎం. ఈ పురస్కారాలను అందుకున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ పి.డి. విద్యార్థినులను అభినందించారు. ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమ అధికారి డాక్టర్ హరిణి మార్గదర్శకత్వంలో ఈ గుర్తింపు లభించడంపై కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments