*శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి* *నూతన ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభినందనలు* *పండుగలా కొనసాగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార వేడుక*


విశాఖ దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు పరిధిలో వన్‌టౌన్ వద్ద ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, జనసేన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నూతన కమిటీ ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ సభ్యులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో వివిధ వార్డులకు చెందిన కూటమి నాయకులు, జనసేన శ్రేణులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments