జాతీయ సేవా పథక కార్యక్రమాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆదర్శనీయం*.


ఆంధ్ర విశ్వవిద్యాలయ -జాతీయ సేవా పథక కార్యక్రమాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అందరికీ ఆదర్శప్రాయం అని జాతీయ సేవా పథక రాష్ట్ర అధికారి  డాక్టర్ ఎం.సుధాకర్ అన్నారు. స్థానిక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన జాతీయ సేవా పథక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ- ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలను చేపడుతూ, ఆంధ్ర  విద్యాలయం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని ప్రశంసించారు. జాతీయ సేవా పథకం విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతోందని,కాబట్టి దాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గత సంవత్సరంలో దేశంలోనే అత్యధిక ప్రత్యేక సేవా  శిబిరాలను ఆంధ్రప్రదేశ్ లో  నిర్వహించడం జరిగిందని, అందులో కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ "మై భారత్" పోర్టల్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు. జాతీయ సేవా పథకం సర్టిఫికెట్స్ కు తగిన ప్రాధాన్యత ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

 సమావేశానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ ప్రిన్సిపల్  ఆచార్య జాలాది రవి మాట్లాడుతూ- జాతీయ సేవా పథకం వాలంటీర్లు విపత్తులకు భయపడకూడదని, విపత్తుల సమయంలోనే చురుకుగా సేవలు అందించాలని అన్నారు.          జిల్లా మరియు యూనివర్సిటీ స్థాయిలో అవార్డులు పొందిన ప్రోగ్రాం అధికారులను, వాలంటీర్ల ను అభినందించారు.

 కార్యక్రమానికి జాతీయ సేవా పథక  కో-ఆర్డినేటర్ డాక్టర్ డి.సింహాచలం అధ్యక్షత వహించగా, ప్రముఖ పర్యావరణ ఉద్యమకారులు శ్రీ జె.వి. రత్నం, కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్ ఆచార్య టి.వి.కృష్ణ , విద్యార్థి సంక్షేమ విభాగ డీన్ ఆచార్య ఎస్.హరినాథ్, ఎన్.ఎస్.ఎస్. జోనల్ అధికారి డాక్టర్ పోలా ఉమామహేశ్వరరావు, జిల్లా ప్రోగ్రాం అధికారులు ఇ.పి.ఎస్. భాగ్యలక్ష్మి, గౌరీ శంకర్, చంద్రశేఖర్, తాతయ్య నాయుడు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో సీనియర్ ప్రోగ్రామ్ అధికారులు వై. అనసూయా దేవి, లక్ష్మీనారాయణ, డాక్టర్ అర్చన, డాక్టర్ హరిణి, పెద్ద సంఖ్యలో వాలంటీర్లు, అవార్డు పొందిన తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 "*అవార్డుల వివరాలు*" డాక్టర్ పల్లవి, డాక్టర్ తాతయ్య నాయుడు ఉత్తమ ప్రోగ్రాం అధికారులుగా ("*యూనివర్సిటీ  స్థాయి*")  

డాక్టర్ బోరుగడ్డ సుబ్బయ్య, డాక్టర్ బి. పిచ్చమ్మ, సిహెచ్. చిన్నం నాయుడు, డాక్టర్ శర్మ  ఉత్తమ ప్రోగ్రాం అధికారులు( "*జిల్లా స్థాయిలో*")అవార్డులను పొందారు.

 వాలంటీర్ల కేటగిరీలో కుమారి సృజన , సాయి ప్రశాంత్ "*యూనివర్సిటీ స్థాయిలోను*";  కె.ఎస్తేర్ రాణి, జె ఆయుష్, పి వేణు, కే హర్షవర్ధన్, పి సుచిత్ర ,జి సాయి ప్రశాంత్ శశాంక్, శివ ప్రసాద్ *"జిల్లాస్థాయి లోను* అవార్డులను పొందారు. మరొక తొమ్మిది మంది వాలంటీర్లకు, జిల్లా నోడల్ అధికారులకు ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు

Post a Comment

0 Comments