మామిడికుదురు మండల వి ఆర్ ఎ లు ఒంటి కాలుపై నిలబడి వినూత్న నిరసన.... 21వ రోజు నిరసన....

.       SRINIVAS SPL Correspondant 
మామిడికుదురు, విశాఖ సందేసం...డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండల  గ్రామ రెవిన్యూ సహాయకులు సంఘం మండల అధ్యక్షులు  ముస్కుడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎమ్. 

బ్రహ్మజి ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యలను  ప్రభుత్వం  తక్షణమే పరిష్కారం చేయాలని నిరసన దీక్షలు 21వ రోజు నిర్వహించారు.. వి.ఆర్.ఎ ల పట్ల    ప్రభుత్వం  నిర్లక్ష్యపు విధానాన్ని విడనాడాలని     

21వ రోజు  ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలుపుతూ తమ సమస్యలు పరిష్కరించాలని భారీ నినాదాలు చేశారు. ఈ నిరసన దీక్షలో  జిల్లా యూనియన్ అధ్యక్షులు డి విరభద్రరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. 

అయిరి నరేష్ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 10 వేలు చేశారని, తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా పే స్కేల్ ఇవ్వాలని అన్నారు. నామినిలను రెగ్యులర్ చేయాలని చేసి ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. సుప్రీమ్ కోర్టు ప్రకటించిన  కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల వేంకటేశ్వర్లు మాట్లాడుతూ చాలి చాలని జీతంతో కుటుంబాలను నెట్టుకోస్తున్నామని ప్రభుత్వం వి ఆర్ ఏ ల సమస్యలు పరిష్కారించాలంటూ కోరారు.

 గుబ్బల నరేష్ మాట్లాడుతూ ప్రజలు మాదిరిగానే మాకు ఓట్లు ఉన్నాయాని మేము ఓట్లు వేసి  ప్రభుత్వనికి సహకరిస్తున్నామని అయినా వి.ఆర్.ఎ లను  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అగ్రహాం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో మండలంలోని వి.ఆర్.ఎలు  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments