జీవీఎంసీ 50వ వార్డులో ప్రజల సమస్యలపై తనకు సమగ్ర అవగాహన ఉందని నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో సమస్యలు పరిష్కరించినట్లు సీనియర్ కార్మిక నాయకుడు,శ్రమశక్తి అవార్డు గ్రహీత వీవీ వామన రావు తెలిపారు. ఆదివారం జీవీఎంసీ 50వ వార్డు కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థిగా వామన రావు బ్రాహ్మణ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసారు.అనంతరం వామన రావు మాట్లాడుతూ వార్డు ప్రజలు తనకు అవకాశమిచ్చి ఓట్లు వేసి గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు.నన్ను గెలిపిస్తే వార్డులో తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల వంటి మౌలిక వసతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.అధిష్టానం తనకు బీ ఫారం ఇస్తుందని విశ్వసిస్తున్నానని,పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని వామనరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో వేదుల హనుమంత రావు,గాడేపల్లి ప్రభాకర శాస్త్రి,కేశాప్రగడ నరసింహమూర్తి,ముళ్ళపూడి కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments