విశాఖపట్నం:విశాఖ సందేశం వార్తా వాహిని :ఎం వి పి కాలనీ లోని శ్రీ సత్య సాయి ప్రేమ సదన్ మందిరం లో దసరా పాంచరాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని గా అమ్మ వారిని ఆవాహనం చేసి భక్తులు పూజించారు.
భక్తిశ్రద్ధలతో శ్రీ దుర్గా దేవికి మహిషాసుర మర్ధిని సహస్ర నామార్చన , అష్టోత్తరంతో మహిళా భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా కొందరు నిరుపేద మహిళలకు చీరలు, శ్రీ సత్య సాయి అమృత కళశాలు( ఒక నెలకు సరిపడా కిరాణా సామానులు ) కూడా అందించారు
అనంతరం బాలల, సువాసిని పూజ జరిపారు. ఇందులో చిన్నారులకు, పెద్ద వారికి శ్రీ దుర్గా మాతగా భావించి పూజలు చేశారు. తరువాత నీరాజన మంత్రం పుష్పములు ఇచ్చాక , శ్రీ దుర్గా దేవికి మంగళ హారతి తో ఈ రోజు ఉదయం పూజలు ముగిసాయి. ఈ పూజల్లో అనేక మంది మహిళలు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాన్ని విశాఖ జిల్లా మహిళా ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీమతి రాధా సత్యవరపు , పండితులు శ్రీ భాస్కర శర్మ, వేదం ఇంచార్జి శ్రీ సుబ్రహ్మణ్యం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ యెన్ నాయుడు బాలా త్రిపుర సుందరి , సిటీ సేవా సమితి కన్వీనర్ శ్రీ బి సాయికుమార్ , ఇతర పదాధికారులు, అనేక మంది భక్తులు భక్తితో పాల్గొన్నారు.
0 Comments