విశాఖపట్నం: ఈరోజు అనగా తేది. 08.10.2026 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు అంతర్జాతీయ బాలికల దినోత్సవం 11.10.2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధుల చే స్టాప్ సెక్స్ సెలక్షన్-సేవ్ గర్ల్ చైల్డ్ థీమ్ తో షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. షార్ట్ ఫిలిమ్స్ సెలక్షన్ లో 5 ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్దులు పాల్గొన్నారు. డా.వి.ఎస్.కృష్ణా డిగ్రీ కళాశాల,ఇసుకతోట, విశాఖపట్నం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఓల్డ్ జైలు రోడ్, విశాఖపట్నం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భీమునిపట్నం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తగరపువలస నుండి విద్యార్ధులు ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నారు.
ఈ కాంపిటీషన్ సెలక్షన్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.లూసీ వారు, డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ-ఎన్.హెచ్.ఎం., శ్రీ హరి కృష్ణ, డి.సి.పి.ఒ. విమెన్ & చైల్డ్ డెవలప్మెంట్ వారు, డా.మంజుల, ప్రిన్సిపాల్, నోడల్ అధికారి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, శ్రీ బి.నాగేశ్వర రావు డెమో వారు మరియు శ్రీ బి.నాగభూషణం అసిస్టెంట్ మలేరియా అధికారి వారు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

0 Comments