SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం...పదవిని నిర్వర్తించడం నల్లేరుపై నడక కాదని ప్రజలకు మనం చేసిన అభివృద్ధి పనులు మాత్రమే పదవికి గుర్తింపునిస్తాయాని మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న అల్లవరం మండల మాజీ జడ్పిటిసి సభ్యురాలు కొనుకు గౌతమి, మాజీ ఎంపీపీ ఇళ్ల శేషగిరి రావు, మాజీ వైస్ ఎంపీపీ వడ్డి గంగ, మండలంలోని ఎంపీటీసీలను మరియు సర్పంచ్ లను మొగళ్లమూరులోని క్యాంపు కార్యాలయంలో అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ, ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేయడంతో పాటు, మండల అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు మరియు సర్పంచులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కొనుకు బాపూజి, సాధనాల వెంకట్రావు,రాపాక విజయలక్ష్మి , బర్రె సీతారత్నం, సాధనాల నాగమణి, రాయడు విష్ణు, కొల్లు వెంకట రమణ , దొమ్మేటి శ్రీ శాంతి భవాని, పెచ్చెట్టి వెంకటేశ్వరావు,మాకే కృష్ణమూర్తి, సత్యం కాపు , అంబికా శ్రీను, కొనుకు మహేష్ , కాశి చిరంజీవి, సాధనాల రాజు ,చెల్లి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.




0 Comments