దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌కు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వానం* *అమ్మవారి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్* *ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే


విశాఖపట్నంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఆలయ ఈ, కమిటీ చైర్మన్, సభ్యులుఆహ్వానం అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలియజేసి, అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరారు.

ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిర్వహించే ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఉత్సవాలు విజయవంతంగా, వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పైలా శేఖర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–1, కె.ఏ. సత్యనారాయణ (రఘు) చైర్మన్, లెంక తీర్నాధ్  వార్డు ప్రెసిడెంట్, యిల్లా శ్రీను, కల్లూరి చంద్రకళ, కిల్లంపూడి శంకర్, నాయన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments