అంగన్వాడీ కేంద్రాలు ఆరో దశాబ్దంలోకి అడుగుపెట్టడం గర్వకారణం: ఐసీడీఎస్ సూపర్ వైజర్ లీలా కుమారి అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం...

.         SRINIVA SPL Correspondant 
 అల్లవరం, విశాఖ సందేసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మరియు ఐసీడీఎస్ కేంద్రం సూచనలతో, అల్లవరం మండలం గోడిలంక గ్రామం, ఇందిరమ్మ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం నెం. 57లో సెంటర్ టీచర్ శెట్టిబత్తుల రత్నకుమారి ఆధ్వర్యంలో అంగన్వాడీ వ్యవస్థ ఏర్పాటై 51 సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఐదు దశాబ్దాలను దిగ్విజయంగా ముగించుకుని ఆరో దశాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఘనంగా వేడుకలు ఘనంగా  నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్ వైజర్  లీలా కుమారి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఐదు దశాబ్దాలుగా అంగన్వాడీ కేంద్రాలు సమాజంలో పిల్లల, తల్లుల సంక్షేమం కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని  కొనియాడారు.

​ఈ వేదికగా ఆమె పిల్లల ఆరోగ్య సూత్రాలు, పౌష్టికాహారం, ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య, పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన ప్రత్యేక ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రత్యేకంగా లీలకుమారి అభినందించారు. అనుభవజ్ఞులైన సిబ్బందికి గుర్తిపు అవసరమని వారిని సన్మానించాలని అభిప్రాయపడుతూ 

గత 36 సంవత్సరాలుగా ఎంతో బాధ్యతాయుతంగా అంగన్వాడీ కేంద్రం నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన టీచర్ శెట్టిబత్తుల  రత్నకుమారి  మరియు సహాయకురాలు పెనుమాల భవానిలను  పిల్లల తల్లులు, కేవీపీఎస్ జిల్లా నాయకులు శెట్టిబత్తుల తులసి దుర్గారావు మరియు గ్రామ పెద్దలు ఘనంగా దుశ్శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.తదుపరి 

​తల్లులకు పిల్లలకు బాలింతలకు సేవలందిస్తున్న ఆశవర్కర్ చంద్రకళను  సన్మానించడం మరియు

తన పిల్లలను ప్రతిరోజూ శ్రద్ధగా అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్న పలువురు తల్లులను గుర్తించి, వారిని ఈ కార్యక్రమంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐసీడీఎస్ సూపర్ వైజర్  లీలా కుమారిని  అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు శాలువాలతో ఘనంగా సత్కరించి గౌరవించారు.

​ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తల్లులు, మరియు హెల్త్ విభాగం ఆశవర్కర్ చంద్రకళ గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments