ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం: ప్రతిష్ఠాత్మక 'NAMSCON 2026' జాతీయ సదస్సుకు న్యాయనిర్ణేతగా పద్మశ్రీ డా. కూటికుప్పల సూర్యారావు*

 

       Dr Nanduri Ramakrishna Sr Sub EDITOR 
విశాఖపట్నంప్రముఖ వైద్య నిపుణులు, నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఇండియా) ఫెలో ప్రొఫెసర్ (డా.) కూటికుప్పల సూర్యారావుకు జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది ప్రతిష్ఠాత్మ కంగా నిర్వహించే నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 66వ వార్షిక సదస్సు కాన్వొకేషన్ (NAMSCON 2026) లో పరిశోధనా ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా (జడ్జ్) వ్యవహరించాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది ఈ జాతీయ సదస్సు అక్టోబర్ 9 నుంచి 11వ తేదీ వరకు తమిళ నాడు, కట్టాంకులత్తూరు లోని SRM మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో జరగ నుంది దేశ, విదేశాల నుంచి వచ్చే వైద్య నిపుణులు,అధ్యాపకులు, యువ పరిశోధకులు సమర్పించే ఉన్నత స్థాయి శాస్త్రీయ పరిశోధనలను డా. సూర్యారావు మూల్యాంకనం చేయ నున్నారు డా.కూటికుప్పల సూర్యారావు సాధించిన ప్రశంసలు, రికార్డులు

*పద్మశ్రీ పురస్కారం* 

వైద్య చికిత్స, పరిశోధన రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2008లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ లభించింది.

*గిన్నిస్ వరల్డ్ రికార్డ్* 

ఎయిడ్స్, హెచ్‌ఐవీ (HIV) పై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు చేసిన కృషికిగానూ 2009లో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు.

*డబ్ల్యూహెచ్ఓ (WHO) ప్రశంసలు*

ఆరోగ్య సేవలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల నివారణలో గణనీయమైన పాత్ర పోషించినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

*ఆరు దశాబ్దాల ఘనమైన సంప్రదాయం*

1961లో అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా ఆంధ్ర మెడికల్ కాలేజీకి (AMC) సుదీర్ఘ చరిత్ర ఉంది. గతంలో ఏపీ నుంచి డా. వ్యాఘ్రేశ్వరుడు, ప్రొఫెసర్ బ్రహ్మయ్య శాస్త్రి, కల్నల్ డా. కె.ఎం.కె. రావు, ప్రొఫెసర్ బి. స్వరాజ్యలక్ష్మి, ప్రొఫెసర్ వి. రామలింగ స్వామి వంటి దిగ్గజాలు NAMS ఫెలోషిప్ పొందారు వారి సరసన నిలిచిన డా. కూటికుప్పల సూర్యారావు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జీవించి ఉన్న ముగ్గురు NAMS ఫెలోలలో ఒకరు కావడం విశేషం. డా. సూర్యారావు లాంటి అనుభవజ్ఞుడి నైపుణ్యం యువ పరిశోధ కులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని NAMSCON 2026 నిర్వహణ కమిటీ పేర్కొంది ఈ ఆహ్వానం ఆయన వ్యక్తిగత గౌరవమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి దక్కిన అరుదైన జాతీయ గుర్తింపుగా నిలిచింది.

Post a Comment

0 Comments