జనసేనలోకి భారీగా చేరికలు.. 100 కుటుంబాలకు పైగా పార్టీలో చేరిక* *పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తి, కూటమి ప్రభుత్వ అభివృద్ధి పాలనపై ప్రజల్లో విశ్వాసం* *జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ భీమిలి ఇంచార్జి సందీప్ గారు* *చిప్పాడ గ్రామ యువనేత శ్రీ శివరామ రెడ్డి తో పాటు 100 కుటుంబాలు చేరిక*


భీమిలి నియోజకవర్గం, చిప్పాడ: జనసేన పార్టీ బలోపేతానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. భీమిలి నియోజకవర్గ పరిధిలోని చిప్పాడ గ్రామంలో సుమారు 100 కుటుంబాలకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు.

స్థానిక యువనేత శ్రీ శివరామరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, భీమిలి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పంచకర్ల సందీప్ కలిసి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సేవా దృక్పథం, ప్రజల పట్ల ఆయన చూపుతున్న స్ఫూర్తి, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ప్రజలు పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు. కొత్తగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి జనసేన కుటుంబంలో సముచిత స్థానం కల్పించి, పార్టీ బలోపేతానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అవంతి కాలేజ్ నుంచి  చిప్పాడ గ్రామం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యువత, జనసైనికులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీధర్ వ్యవహరించగా, జనసేన పార్టీకి చెందిన వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ నాయకులు శ్రీ కృష్ణయ్య  గారు, శ్రీమతి భువనేశ్వరి గారు, శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ దివాకర్ గారు, శ్రీ శివ గారు, శ్రీ గణేష్ గారు, శ్రీ పాపారావు గారు, స్థానిక నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments