ప్రజాసేవే లక్ష్యంగా డాక్టర్ కందుల *నవ వధువుకు బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాల అందజేత* *మరో చిన్నారికి పట్టు వస్త్రాలు వెండి వస్తువులు* *భూపేష్ నగర్ లో సుడిగాలి పర్యటన.. ప్రజా సమస్యలకు పరిష్కారం*


అల్లిపురం విశాఖపట్నం సెప్టెంబర్ 20: ప్రజాసేవే లక్ష్యంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్‌, విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కేఎన్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ కందుల నాగరాజు చేపడుతున్న సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. 32వ వార్డుకే పరిమితం కాకుండా దక్షిణ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు.

ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, సాధ్యమైనంత త్వరగా వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారని నిర్వాహకులు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన సందర్భాల్లో తన వంతు సహాయాన్ని అందిస్తూ సామాజిక సేవలో ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలో ఆదివారం భూపేష్‌నగర్‌ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో శుభకార్యం సందర్భంగా మధుశ్రీకి పట్టుచీర, వెండి సామగ్రి, ఇతర వస్తువులను డాక్టర్‌ కందుల నాగరాజు అందజేశారు. అదే ప్రాంతానికి చెందిన నవవధువు ప్రసన్నకు బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, పసుపు–కుంకుమలను అందించారు. అలాగే భూపేష్ నగర్ లో డ్రైను నిర్మాణంతో పాటు కాలనీకి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని కందుల హామీ ఇచ్చారు.. కొందరు తోపుడు బళ్ళు కావాలని.. ఒక వ్యక్తి వీల్ చైర్ కావాలని కందులను కోరగా సానుకూలంగా స్పందించారు..

త్వరలో ఆ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..

ఈ సందర్భంగా డాక్టర్‌ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అభివృద్ధితో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.

జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ డాక్టర్‌ కందుల నాగరాజు సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంతో పాటు, అవసరమైన వారికి వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న ఆయన మానవతా దృక్పథాన్ని అభినందించారు.

కార్యక్రమంలో ఎస్‌కేఎంఎల్‌ ట్రస్టీ గరికిన ఎల్లయ్య, కె.కృష్ణ, పి.నీలబాబు, కె.మనోహర్‌, చిన్ని అప్పారావు, కె.అప్పారావు, వి.శ్రీను, సీహెచ్‌.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments