సింహాచలం..విశాఖపట్నం, సెప్టెంబర్ 20: సింహాద్రినాథుడిని దర్శించుకుంటే సర్వపాపాలు హరించిపోతాయని, భక్తులకు సిరిసంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయని అప్పన్న భక్తకోటి ప్రగాఢ విశ్వాసమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు డాక్ యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు.
ఆదివారం సింహాచలం మెట్ల మార్గంలోని స్వామివారి నిజరూప విగ్రహాన్ని గంట్ల శ్రీనుబాబు, ఆయన సతీమణి సత్య వతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి పావంచ వద్ద పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా సమయంలోనూ భక్తులు ఇక్కడ స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
వరాహ, నరసింహ అవతారాలతో సింహాచల కొండపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి భక్తులకు నిరంతరం దివ్యదర్శనం ప్రసాదిస్తూ విరాజిల్లుతున్నారని తెలిపారు
0 Comments