సింహాచలం...విశాఖపట్నం, సెప్టెంబర్ 20: సింహాచలం అప్పన్న స్వామివారి సోదరిగా, 14 గ్రామాల ప్రజల పొలిమేర దేవతగా పూజలందుకుంటున్న శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు.ఆదివారం గంట్ల శ్రీనుబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు పి. వెంకట్రావుతో కలిసి ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చించారు.
అమ్మవారి చేతులకు వెండి అలంకరణలు చేయించాలని భావిస్తున్నామని, ఇందుకు అవసరమైన వెండి సామాగ్రి సేకరణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.. అలాగే ఆలయ అభివృద్ధికి తగిన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీనుబాబు తెలిపారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భక్తులు .. అడవివరం శ్రీనివాస్ నగర్ గ్రామాల ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.


0 Comments