సౌత్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంస్థ/విశాఖపట్నం విభాగం ఆధ్వర్యంలో ఆన్-ది-స్పాట్ డ్రాయింగ్ పోటీలు


విశాఖపట్నం: సౌత్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంస్థ (SCoRWWO), విశాఖపట్నం విభాగం ఆధ్వర్యంలో పిల్లల కోసం నిర్వహించిన ఆన్-ది-స్పాట్ డ్రాయింగ్ పోటీలు ఘనంగా జరిగాయి.

 ఈ పోటీలలో సుమారు 157 మంది చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను, కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఎస్‌సీఓఆర్‌డబ్ల్యూవ్యూఓ/విశాఖపట్నం విభాగం అధ్యక్షురాలు శ్రీమతి జ్యోత్స్నా బోహ్రా, ఉపాధ్యక్షులు శ్రీమతి గాయత్రి సంతానం, శ్రీమతి కె. సుహాసిని, కార్యదర్శి శ్రీమతి నికితా శర్మ, కోశాధికారి శ్రీమతి నీహారిక మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

పోటీలలో పాల్గొన్న ప్రతి చిన్నారికి ప్రోత్సాహకంగా బహుమతులు మరియు అల్పాహారం అందజేశారు. పిల్లలలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం మరియు కళల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Post a Comment

0 Comments