విశాఖపట్నం -సౌత్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంస్థ (SCoRWWO), 2026 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు 'స్వచ్ఛత మే సహభాగ్; స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్' అనే ఇతివృత్తంతో (థీమ్) దేశవ్యాప్తంగా నిర్వహించిన 'స్వచ్ఛతా హీ సేవా (SHS) 2026' మరియు 'స్వచ్ఛతా పఖ్వాడా' కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది.
SCoRWWO అధ్యక్షురాలు శ్రీమతి చారు మాథుర్ నాయకత్వంలో, సంస్థ రైల్వే ప్రాంగణాల్లో పలు సమగ్ర పారిశుద్ధ్య కార్యక్రమాలను, సామాజిక అవగాహన సదస్సులను విజయవంతంగా చేపట్టింది.
రైల్వే కాలనీలు, పార్కులు, నివాస సముదాయాలు మరియు వాటి పరిసర బహిరంగ ప్రదేశాలలో SCoRWWO సభ్యులు విస్తృత స్థాయి పారిశుద్ధ్య డ్రైవ్‌లను నిర్వహించారు. శ్రీమతి చారు మాథుర్ మరియు విశాఖపట్నం డివిజన్ మహిళా సంక్షేమ విభాగం అధ్యక్షురాలు శ్రీమతి జ్యోత్స్న బోహ్రా సంయుక్త ఆధ్వర్యంలో ఈస్ట్ పాయింట్ కాలనీ మరియు సాగర్ వ్యూ రైల్ పార్కులలో భారీ ఎత్తున 'శ్రమదానం' చేపట్టారు.ఈ కార్యక్రమాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ (Solid Waste Management - SWM) నిబంధనల అమలుకు ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా చెత్తను ప్రారంభ దశలోనే తడి, పొడి, శానిటరీ మరియు ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా విభజించే నాలుగు విభాగాల వర్గీకరణ పద్ధతిపై విస్తృత అవగాహన కల్పించారు.
క్షేత్రస్థాయి పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ, సంస్థ హౌస్ కీపింగ్ సిబ్బందికి (సఫాయిమిత్రలకు) నిత్యావసర ఆరోగ్య కిట్లను పంపిణీ చేసింది. అదేవిధంగా పౌష్టికాహారం, నివారణ ఆరోగ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై వారితో ముఖాముఖి అవగాహన సదస్సులను నిర్వహించింది.
ప్రజా పారిశుద్ధ్యం, పర్యావరణహిత స్థిరమైన పద్ధతులు మరియు రైల్వే ఉద్యోగుల సంక్షేమానికి SCoRWWO ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది.


0 Comments