విశాఖపట్నం: సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్లోని రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘వోక్స్ పాప్–2K26 – Voice of the People’ అకడమిక్ ఈవెంట్‌ను 30 సెప్టెంబర్ 2026న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, చర్చా సంస్కృతి, సమకాలీన రాజకీయ అంశాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు వేదిక కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
నగరంలోని వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన అండర్గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్‌గ్రాడ్యుయేట్ (PG) విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డా. జి. రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు జె. రామారావు, సుస్మితా దాస్, అలాగే ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల రాజనీతి శాస్త్ర విద్యార్థినులు పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.


0 Comments