విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని- గాయత్రీ విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ (A), (ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా, NAAC ద్వారా 'A' గ్రేడ్ గుర్తింపు పొందినది), ఋషికొండ, విశాఖపట్నం, ఆధ్వర్యంలో "NEP 2020 అమలు
ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు 2026 సెప్టెంబర్ 25, 26 తేదీలలో నిర్వహించబడుతోంది. ఈ జాతీయ సదస్సును మేనేజ్ మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం గాయత్రీ విద్యా పరిషత్ అధ్యక్షులు, ముఖ్య సంరక్షకులు (Chief Patron) ప్రొఫెసర్ డా. పి. శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో జరుగుతోంది. ప్రొఫెసర్ పి.వి. శర్మ గౌరవాధ్యక్షులుగా, GVPCDPGC ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.ఎస్. బోస్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ ఎస్. రజని సదస్సు కన్వీనర్, ప్రొఫెసర్ ఎం.ఎస్.ఆర్. శేషగిరి మరియు ప్రొఫెసర్ కె.వి.వి. మురళి సోమేశ్వరరావు సహ-కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు.
సదస్సుకు ప్రొఫెసర్ పి. సోమరాజు, కార్యదర్శి, GVP: శ్రీ డి. దక్షిణామూర్తి గారు; జి.వి.పి.వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పి. రాజగణపతి, సభ్యులు, GVP: ప్రొఫెసర్ వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, సభ్యులు, GVP; మరియు ప్రొఫెసర్ పి. వెంకట్రావు, రిజిస్ట్రార్ ఇన్చార్జ్, GVPIHLR సంరక్షకులుగా (Patrons) వ్యవహరిస్తున్నారు.
చండీగఢ్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్, SWAYAM వ్యవస్థాపక డైరెక్టర్ మరియు GCC స్కూల్ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. మన్రీత్ సింగ్ మన్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొఫెసర్ పి. సోమరాజు, ప్రొఫెసర్ ఎస్. రజని మరియు ప్రొఫెసర్ మన్రీత్ సింగ్ మన్నా సమక్షంలో జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.ఎస్. బోస్ గాయత్రీ విద్యా పరిషత్ ఆవిర్భావం మరియు పరిణామ క్రమాన్ని వివరించారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్. రజని సదస్సు ముఖ్య ఉద్దేశాలను వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో NEP 2020 నేపథ్యంలో విద్య యొక్క ప్రత్యేకమైన మరియు కీలకమైన పాత్రను. అలాగే నేటి పోటీ ప్రపంచంలో రాణించడానికి విద్యార్థులు అభివృద్ధి చేసుకోవాల్సిన లక్షణాలను ఆమె వివరించారు.
అనంతరం ప్రముఖులు సదస్సును అధికారికంగా ప్రారంభించి, NEP 2020 అమలు మరియు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై రెండు రోజుల పాటు జరిగే విద్యా చర్చలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ మన్రీత్ సింగ్ మన్నా మాట్లాడుతూ, NEP 2020 విద్యార్థి కేంద్రిత, చురుకైన మరియు అనుభవాధారిత అభ్యాసానికి ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల విభిన్న అవసరాలు, సామర్థ్యాలను గుర్తిస్తూ, విద్యా సంస్కరణల్లో విద్యార్థులను కేంద్రంగా ఉంచడం ద్వారా అభ్యసన ఫలితాలు, నైపుణ్యాలు, సమగ్ర వ్యక్తిత్వ వికాసం మరియు భవిష్యత్ అవకాశాలను మెరుగుపరచడం NEP 2020 ప్రధాన లక్ష్యాలలో ఒకటని వివరించారు. అదే సమయంలో పరిశ్రమ-విద్యా సంస్థల మధ్య సహకారాన్ని (Industry Academia Collaboration) మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
ఈ సదస్సు NEP 2020 అమలులో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి, వాటిపై చర్చించడం, సాధ్యమైన వ్యూహాలు మరియు పరిష్కారాలను అన్వేషించడం ప్రధాన లక్ష్యంగా నిర్వహించబడుతోంది. అలాగే ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలను బహుళ శాఖా (Multidisciplinary) సంస్థలుగా రూపాంతరం చేయడం, పరిశోధన మరియు బోధనా నాణ్యతను బలోపేతం చేయడం. పాఠ్య ప్రణాళికలను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించడం, పరిశోధన ఆధారిత మరియు సాంకేతికతతో కూడిన విద్యా వ్యవస్థలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై కూడా సదస్సులో చర్చించనున్నారు.
NEP 2020 భారతదేశ విద్యా రంగాన్ని సమగ్రంగా రూపాంతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని నిర్వాహకులు తెలిపారు. ఈ విధానంలో విద్యకు ప్రాప్యత (Access), సమానత్వం (Equity), నాణ్యత (Quality), అందుబాటు ధర (Affordability), జవాబుదారీతనం (Accountability) వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, బహుళ శాఖా అభ్యాసం, ఆవిష్కరణ, విమర్శనాత్మక ఆలోచన, పరిశోధన మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది.
ఈ జాతీయ సదస్సుకు ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు, డీన్లు, విభాగాధిపతులు, సీనియర్ విద్యావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు మరియు నైపుణ్యాభివృద్ధి నిపుణులు హాజరై, NEP 2020 అమలు విధానం, దాని అవకాశాలు, సవాళ్లు మరియు పరిష్కార మార్గాలపై విస్తృతమైన విద్యా చర్చలు నిర్వహించనున్నారు.



0 Comments