. SRINIVAS SPL Correspondent
అల్లవరం, విశాఖ సందేసం....తుఫాను మరియు వరదల సమయంలో రైతులు పాడి పశువుల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోషణను అందించాలని ఏరియా పశువైద్యశాల సహాయ సంచాలకులు డా. ఎల్. విజయ రెడ్డి సూచించారు. అల్లవరం మండలం, కొడూరుపాడు గ్రామంలో ఆయన పర్యటించి, రైతులకు తుఫాను సమయంలో పాడి పశువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల షెడ్డు పల్లపు ప్రాంతంలో ఉంటే, ఎత్తైన ప్రదేశంలో ఉన్న పాఠశాల, కల్యాణ మండపం లాంటి గట్టి భవనాల్లోకి మార్చాలన్నారు. 7 రోజులకు సరిపడా ఎండుగడ్డి, దాణా, తవుడు నిల్వ ఉంచి, పాలిథిన్ కవర్ తో జాగ్రత్త పరచుకోవాలన్నారు.3-4 రోజులకు సరిపడా తాగునీటిని డ్రమ్ములలో నిల్వ చేసుకోవాలన్నారు.ప్రతి పశువు మెడకు యజమాని పేరు, ఫోన్ నంబర్ ఉన్న ట్యాగ్ కట్టాలన్నారు. తుపాను మరియు వరదలు సంబవించినప్పుడు పశువులను తాడుతో గట్టిగా కట్టేసి ఉంచకుండా తాడు వదిలేయాలన్నారు. నీటి మట్టం పెరిగితే అవే ఈదుకుని బ్రతుకుతాయన్నారు.కరెంటు స్తంభాలు, కూలిపోయే చెట్ల దగ్గర పశువులను కట్టకూడదన్నారు. అత్యవసర సహాయం కోసం పశు సంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ *1962* మరియు విపత్తు నిర్వహణ *1077* కు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య అధికారి అల్లు కావ్య, కొడూరుపాడు సెక్రటరీ దుర్గాప్రసాద్, విలేజ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కె. శివ నాగేంద్ర, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎమ్ .గిరీష్, పాడి రైతులు పిల్లా చిన్నబ్బులు, వెంకటలక్ష్మి, డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


0 Comments