భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ ఉక్కు కర్మాగారంలోని CISFలో పనిచేస్తున్న శ్రీ ఎం వెంకట కృష్ణా రావు , ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యునిగా, సమయస్ఫూర్తితో స్పందించి అరుదైన AB పాజిటివ్ రక్తాన్ని దానం చేసి మానవతా సేవకు ఆదర్శంగా నిలిచారు.
పాలకొల్లుకు చెందిన శ్రీమతి నాగ భారతి గారికి రక్తం అవసరమని ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి వాట్సాప్ గ్రూపులో సందేశం రావడంతో శ్రీ ఎం వెంకట కృష్ణా రావు వెంటనే స్పందించారు.
ఎవరూ వ్యక్తిగతంగా అభ్యర్థించకపోయినా, రక్తం అవసరాన్ని తెలుసుకున్న వెంటనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో రక్తదానం చేశారు.
అత్యవసర సమయంలో, ముఖ్యంగా అరుదైన రక్త గ్రూపుకు సంబంధించిన అవసరాన్ని తీర్చేందుకు ఆయన చూపిన స్పందన, సేవాభావం మరియు మానవతా దృక్పథం అభినందనీయం.భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి “ప్రేమించు – అందరినీ సేవించు”, “సేవయే మాధవ సేవ” అనే సందేశాలకు అనుగుణంగా శ్రీ ఎం వెంకట కృష్ణా రావు గారు చేసిన ఈ నిస్వార్థ సేవ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలనే స్ఫూర్తిని అందిస్తోంది.
సమయానికి అందించిన ఈ రక్తదానం అవసరంలో ఉన్న రోగికి ఎంతో విలువైన సహాయాన్ని అందించింది.
ఒక చిన్న సేవా చర్య ఒక కుటుంబానికి ఎంతో పెద్ద ఆశగా, భరోసాగా మారుతుందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
ఈ సందర్భంగా ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు, రోగి కుటుంబ సభ్యులు శ్రీ ఎం వెంకట కృష్ణా రావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆయనకు మరియు కుటుంబ సభ్యులకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహం, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని ప్రార్థించారు.
శ్రీ డి.ఏ.వి. సన్యాసి రాజు, కన్వీనర్, ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి


0 Comments