జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి,


విశాఖపట్నం జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (National Deworming Day) కార్యక్రమాన్ని 28-09-2026న  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా విద్యాశాఖాధికారి ఈ కార్యక్రమాన్ని GVMC హైస్కూల్ బాలుర పాఠశాల మరియు KNM బాలికల హైస్కూల్లలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ పాఠశాలలో మొత్తం456 విద్యార్థిని విద్యార్థులకు ఆల్బెండజోల్  టాబ్లెట్ ను వేయడం జరిగింది.

జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు ఇతర సంబంధిత సంస్థల ద్వారా అర్హులైన పిల్లలు, కిశోరులకు నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలను అందజేయనున్నారు. 1 నుండి 2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అర మాత్రను నీటిలో కరిగించి ఇవ్వాలి. 2 నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఒక పూర్తి మాత్రను నీటిలో కరిగించి ఇవ్వాలి. 3 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు/కిశోరులకు ఒక పూర్తి మాత్రను నమిలి మింగేలా చూడాలనిజిల్లా విద్యఆరోగ్యశాఖాధికారి ఆదేశించారు.

మాత్రలను మధ్యాహ్న భోజనం అనంతరం ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ సిబ్బంది పర్యవేక్షణలో ఇవ్వాలని సూచించారు. పిల్లలకు మాత్రలను స్వయంగా మింగకుండా, వయస్సుకు అనుగుణంగా సరైన విధానంలో ఇవ్వడం, అవసరమైన సూచనలు పాటించడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరారు.

జిల్లా లో5,74,496 మంది బాలబాలికలు ఉండగా వీరిలో 98.4% మందికి నులిపురుగులమాత్రలు వేయగా మిగిలిన పిల్లలకి మ్యాప్ అప్ రోజున వేయడం జరుగుతుందని జిల్లా విద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు

జిల్లాలో ఏ ఒక్క అర్హత కలిగిన పిల్లవాడు కూడా నులిపురుగుల నిర్మూలన మాత్రకు దూరం కాకుండా చూడాలని, పాఠశాల విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు సంబంధిత శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. NDD రోజున మాత్ర తీసుకోలేని పిల్లలకు మాప్-అప్ కార్యక్రమం ద్వారా మాత్రలు అందించేలా చర్యలు తీసుకోనున్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు ఆరోగ్య సిబ్బంది/ఉపాధ్యాయుల పర్యవేక్షణలో తప్పనిసరిగా ఇప్పించి, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా విద్యాశాఖాధికారి విజ్ఞప్తి చేశారు.

జిల్లా NDD మానిటరింగ్ ఆఫీసర్ గాడా.రాధారాణి రీజినల్ డైరెక్టర్ వ్యవహరించారు.

ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు గారు మరియు జిల్లా విద్య శాఖాధికారి ప్రేమ కుమార్ గారు మరియు  జిల్లా ఆర్.బి.ఎస్.కె. ప్రోగ్రామ్ ఆఫీసర్ బి.హారిక వారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లోఆర్,బి,ఎస్,కె,డి.ఇ.ఐ.సి మేనేజర్, స్కూల్ ప్రిన్సిపాల్స్ శేషు కుమారి గారు, శాంతి కుమారి గారు, ఎం.ఇ.ఒ.లు, ఎ.ఎన్.ఎం లు, ఆశా కార్యకర్తలు  మరియు తరితరులు పాల్గొన్నారు.

              జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

                         విశాఖపట్నం

Post a Comment

0 Comments