వినాయక నవరాత్రుల సందర్భంగా భారీ అన్న సమారాధన


గాజువాక న్యూస్: గాజువాక నియోజకవర్గం 65వ వార్డు పరిధిలోని మింది గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా “మెగా విక్టరీ బాయ్స్” ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ 68వ వార్డు ఇన్‌చార్జి గుడివాడ సతీష్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరావు హాజరయ్యారు. వారు వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులతో కలిసి అన్న సమారాధనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, మెగా విక్టరీ బాయ్స్ ఆధ్వర్యంలో 27 సంవత్సరం ల నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు భారీ అన్న సమారాధన చేపట్టడం అభినందనీయమన్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.


ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, నేషనల్ కౌన్సిల్ మెంబర్, ఐ న్యూస్ డెస్క్ ఇన్‌చార్జి జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా భక్తుల కోసం అన్న సమారాధన ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం దీపారాధన, అనంతరం ప్రతి సంవత్సరం మాదిరిగానే కుంకుమ పూజ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల చివరి రోజున స్వామివారి లడ్డూ ప్రసాదం వేలం పాట, అనంతరం గణనాథుని నిమజ్జనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విగ్రహ దాత కంద వంశీ, మాదాసు కౌసిక్ , మెగా విక్టరీ బాయ్స్ఆర్గనైగెర్స్ సుంకర శ్రీనివాస్, శంకర్, రాజశేఖర్,సిగటాపు కార్తీక్, దినేష్, సురేష్,కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments