బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అంగన్వాడి ఉత్సవం


 ఆనందపురం, సెప్టెంబర్ 30: దేశ ప్రధాని నరేంద్ర మోడీ 25 సంవత్సరాలుగా చేస్తున్న ప్రజాసేవే లక్ష్యంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ 

కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా కిసాన్  మోర్చా ఆధ్వర్యంలో బుధవారం అంగన్వాడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

 విశాఖపట్నం జిల్లా, ఆనందపురం  మండలం లోని పెద్దిపాలెం కింగ్స్ ఫంక్షన్ హాల్ వేదికగా కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొట్నూరు వెంకట కృష్ణారావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం ఎం ఎన్ పరశురామరాజు అంగన్వాడి ఉత్సవాలు గూర్చి వివరిస్తూ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చిన్నపిల్లలకు పాలు, గుడ్లు,విటమిన్ పౌడర్, ఇతర వినియోగ పోషకాలు సంపూర్ణంగా అందిస్తుందని పేర్కొన్నారు. ఈ పోషక పదార్థాలకు సంక్షేమ నిధులను అంగన్వాడీ సంక్షేమ నిధులనుంచి కేంద్ర ప్రభుత్వం తెలిపారు.

 అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కిసాన్ మొర్చ జిల్లా అధ్యక్షులు కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అంగన్వాడీల సంక్షేమ నిధులను దుర్వినియోగం చేయకుండా అందరూ సిబ్బంది కృతనిత్యంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం లోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల అంగన్వాడి  సిబ్బందిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ జీరు కైలాస రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధాణేష్, జిల్లా కిషన్ మోర్చా మహిళా అధ్యక్షురాలు నాదెండ్ల జ్యోతి, జిల్లా బిజెపి మహిళా కార్యదర్శి సునీత, ఆనందపురం మండలం, 

పద్మనాభం మండలం బిజెపి అధ్యక్షులు పిల్లా విజయ, తమటపు నాగమణి, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి డి పి జే రాజు, భీమిలి నియోజకవర్గం ఐసిడిఎస్ పిఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments