జర్నలిస్టులపై దాడుల కేసుల విచారణకు హైపవర్ కమిటీ ఏర్పాటు... మంత్రి శ్రీ పార్ధసారధికి ఏపీడబ్ల్యూజేఎఫ్ కృతజ్ఞతలు.

 


విశాఖపట్నం, సెప్టెంబర్ 30.రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు హోంమంత్రి అధ్యక్షతన హైపవర్ కమిటీ ఏర్పాటు చేయడం పట్ల ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా యూనిట్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధికి కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల విశాఖపట్నం వచ్చిన మంత్రికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు నాయకత్వంలో ప్రతినిధి బృందం ఈ మేరకు వినతి పత్రం ఇవ్వడం,మంత్రి స్పందించి అటాక్స్ కమిటీని నియమించడం పట్ల జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్సులు పి. నారాయణ్, జి. శ్రీనివాస్, ఏపీబీజేఏ అధ్యక్ష, కార్యదర్సులు ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్సులు జగన్మోహన్, శ్రీనివాస్ ప్రభుత్వంకు ధన్యవాదములు తెలిపారు.ఈ అటాక్స్ కమిటీలతో జర్నలిస్టులపై దాడులు తగ్గుతాయన్న ఆశాభావం వ్యక్తపరిచారు

Post a Comment

0 Comments