ఆంధ్ర విశ్వవిద్యాలయం, సెప్టెంబర్ 26: కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నూతనంగా అభివృద్ధి చేసిన సమర్ధ్ ఆన్లైన్ పోర్టల్ పై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏయూ వైస్ ఛాన్స్లర్ ఆచార్య జి.పి రాజశేఖర్ ప్రారంభించి కార్యక్రమ ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. ఆన్లైన్లో వివిధ సేవలు అందించడం వలన వేగవంతంగా సేవలు పొందడం సాధ్యపడుతుందని సూచించారు. ఆచార్యులు దీనిని వినియోగి స్తూ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏయూ కంప్యూటర్ సెంటర్ సంచాలకులు ఆచార్య భాస్కర్ రెడ్డి సమర్ధ్ పోర్టల్ ద్వారా అందిస్తున్న సేవలను విపులంగా తెలియజేశారు ఆచార్యులకు విద్యార్థులకు సంబంధించిన విభిన్న సేవలను ఒకేదానిపైకి తీసుకువచ్చి అందించడం జరుగుతుందని తెలిపారు. పోర్టల్ ఏర్పాటు, నిర్వహణ, ఉపయోగాలపై డెమో ఇచ్చారు. పరిపాలన విధానం, అనుమతులకు సంబంధించిన అంశాలను ఆన్లైన్లో వేగంగా అందించే విధంగా సమర్ధ్ పోర్టల్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది అని చెప్పారు.కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య పులిపాటి కింగ్, పాలకమండలి సభ్యులు, ప్రిన్సిపల్స్, డీన్లు ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.



0 Comments