జీవీఎంసీలో విశ్వకర్మ కు ఘన నివాళులు. * విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జీవీఎంసీ అదనపు కమిషనర్లు.

 


విశాఖపట్నం, సెప్టెంబర్ 17: విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి జీవీఎంసీ అదనపు కమిషనర్లు సత్యవేణి, ఎస్.ఎస్. వర్మ, డి.వి. రమణమూర్తి, పి. నల్లనయ్య, రమేష్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ సత్యవేణి మాట్లాడుతూ, విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న నిర్వహించుకుంటామని తెలిపారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మను సృష్టికర్తగా, దివ్య వాస్తుశిల్పిగా, శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా భావిస్తారని పేర్కొన్నారు. నిర్మాణ, వాస్తు, శిల్ప రంగాల్లో విశ్వకర్మకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. అనంతరం అదనపు కమిషనర్లు మాట్లాడుతూ, పురాణాల ప్రకారం విశ్వకర్మ దేవతలకు అనేక దివ్య ఆయుధాలు, నిర్మాణాలు రూపొందించారని తెలిపారు.

శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగర నిర్మాణంతో పాటు పాండవుల ఇంద్రప్రస్థ రాజ్య నిర్మాణంలోనూ విశ్వకర్మ పాత్ర ఉందని పురాణాలు పేర్కొంటున్నాయని తెలిపారు. దివ్య శిల్పిగా, వాస్తుశిల్పిగా ఆయనను స్మరించుకుంటారని పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా శ్రమ, నైపుణ్యం, సృజనాత్మకత, నిర్మాణ రంగంలో సేవలందిస్తున్న శిల్పులు, వాస్తుశిల్పులు, సాంకేతిక నిపుణులు, కార్మికుల సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ అభివృద్ధిలో నిర్మాణ, శిల్ప రంగాల ప్రాధాన్యత ఎంతో ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పద్మజ, ఇన్‌చార్జి స్పోర్ట్స్ డైరెక్టర్ ఈ.ఏ. రాజు, జీవీఎంసీ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ


 



Post a Comment

0 Comments