SRINIVAS SPL Correspondant
అల్లవరం: విశాఖ సందేసం....అల్లవరం మండలం గోడి గ్రామంలోని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ క్యాంపు కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇటీవల పదవీ విరమణ పొందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులను కుటుంబ సమేతంగా ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ దంపతులు దుశ్శాలువాలు కప్పి, పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వీట్ బాక్సులను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ, పదవులు అనేవి తాత్కాలికమని, పార్టీ కోసం నిరంతరం పనిచేసే నాయకులు, కార్యకర్తల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు ఎన్నో ప్రలోభాగాలకు లోను చేసిన పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రతి ఒక్కరు శ్రమించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం ప్రజల మధ్య ఉండాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు. వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు కొనుకు బాపూజీ, జిల్లా మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి కొనుకు గౌతమి, జిల్లా మహిళా కార్యదర్శి పులుసుగంటి రాజేశ్వరీ, జిల్లా అంగన్వాడీ విభాగ కార్యదర్శి వడ్డి గంగ, జిల్లా ప్రచార కార్యదర్శి కర్రి శ్రీను, మాజీ సర్పంచ్లు సాధనాల వెంకటరావు, రాయుడు విష్ణు, ఆర్. విజయలక్ష్మీ, బర్రే సీతారత్నం, కొల్లు వెంకటరమణ, మాజీ ఎంపీటీసీలు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు, మాకే కృష్ణమూర్తి, గుబ్బల రంగనాధస్వామి, దొమ్మేటి శ్రీశాంతిభవాని, బస్వాని పద్మ, పాల శ్రీదేవి, కర్రి సత్య, కొనుకు మహేష్, దొమ్మేటి వెంకటేశ్వరరావు, పులుసుగంటి ప్రమోద్, కొల్లు నాగేశ్వరరావు, పాల వర్మ. సాధానాల రాజు, బస్వాని రాజు తదితరులు పాల్గొన్నారు. |

0 Comments