విశాఖపట్నంలోని **సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్ (స్వయం ప్రతిపత్తి)**లో రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘Voxpop 2K26 – Voice of the People’ పేరుతో అంతర్ కళాశాల అకడమిక్ ఫెస్ట్‌ను బుధవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆదిత్య, బుల్లయ్య, ANITS, వివియన్, MVR తదితర కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ఇంగ్లీష్ విభాగాధిపతి, IQAC కోఆర్డినేటర్ డా. టి. భాస్కర సుధ గౌరవ అతిథిగా హాజరై ఫెస్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలను అలవరచుకోవాలని, ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమాజం, దేశ అభివృద్ధిలో చురుకైన భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
అనంతరం వివిధ కళాశాలల విద్యార్థులు వ్యాసరచన, వక్తృత్వం, డిబేట్, పోస్టర్ ప్రజెంటేషన్, జనరల్ క్విజ్, రిపోర్ట్ ప్రజెంటేషన్ తదితర అకడమిక్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించారు.
మధ్యాహ్నం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్ ప్రియాంక దండి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఉన్నత ఆలోచనలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విజేతలకు ఆమె చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా రాజనీతిశాస్త్ర విభాగాధిపతి మిస్టర్ జి. రమేష్ మాట్లాడుతూ ‘Voxpop 2K26’ను విజయవంతంగా నిర్వహించడంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది విశేష కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో రాజనీతిశాస్త్ర అధ్యాపకులు జె. రామారావు, సుస్మితా దాస్ తదితరులు, ఇతర విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
“విభిన్న స్వరాలు – ఒకే వేదిక; ప్రజాస్వామ్యానికి విద్యార్థుల గొంతుక!” అనే సందేశంతో నిర్వహించిన Voxpop 2K26 విద్యార్థుల్లో సృజనాత్మకత, వక్తృత్వ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక మరియు ప్రజాస్వామ్య స్పృహను పెంపొందిస్తూ విజయవంతంగా ముగిసింది


0 Comments