స్వచ్ఛత
స్వచ్ఛందంగా
వచ్చేది.
ముందు మన
మనస్సు
స్వచ్ఛంగా
ఉండాలి,
అప్పుడే మనం
స్వచ్ఛత గురించి
మాట్లాడే
హక్కు ఉంటుంది.
పర్యావరణ
పరిరక్షణ
అందరి
బాధ్యత,
కర్తవ్యం.
పంచ
భూతాలు
కలుషితం,
కాలుష్య
మయం
కాకుండా
చూసుకోవలసిన
బాధ్యత
ప్రతీ పౌరునిది.
నేల, నీరు, నిప్పు
గాలి, నింగి
దైవం మనిషికి
ఇచ్చిన వరం.
సాగరం,
నదులు,
భూమి,
అన్నీ
మానవ
చర్యల
మూలంగా
కాలుష్యాన్ని
వెద జల్లు
తున్నాయి.
మనిషి తన
స్వార్థం కోసం
దేనికైనా
వెనుకాడకుండా
విచక్షణ
కోల్పోయి
మసులుతున్నాడు.
కాలుష్య
కారకకం
మానవ చర్యల
వల్లే.
రాబోయే
తరాల
మనుగడ కోసం
మనం కాలుష్యానికి
అడ్డుకట్ట
వేయాలి,
సమస్త ప్రాణికోటిని
రక్షించు కోవాలి.
జంతు జాతి,
వృక్ష జాతి
పక్షి జాతిని
పరి రక్షించు
కోవాలి.
దీని కోసం
అందరం
నడుం బిగించి
నేడే సమాయత్త
మవ్వాలి.
ప్రభుత్వంపూనుకొని
తగిన చర్యలు
గైకొనాలి,
అడ్డుకట్ట వేయాలి.
ఇది అందరి
బాధ్యత
కర్తవ్యం,
సమాజ హితం
కోసం.
డాక్టర్ నండూరి రామకృష్ణ
సీనియర్ సబ్ ఎడిటర్

0 Comments