SRINIVAS SPL Correspondent
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం రూరల్ మండలం ఏ.వేమవరప్పాడు గ్రామ సచివాలయంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం గురువారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామ మాజీ ఉపసర్పంచ్, జనసేన నాయకులు వాకపల్లి వెంకటేశ్వరరావు,టీడీపీ గ్రామ కమిటీ నాయకులు కొమ్మాబత్తుల ప్రసాద్ లు రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి అనురాధ, పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి విళ్ళ సత్యనారాయణ, యల్లమిల్లి గిరి, విళ్ళ భీమేశ్వరరావు,బూత్ కమిటీ సభ్యులు,రైతులు, గ్రామస్తులు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments