బీజేపీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి – ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు


విశ్వకర్మ జయంతిని మరియు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆరిలోవలో బీజేపీ జిల్లా మీడియా కన్వినర్ తిప్పనబోయిన కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో శానిటరీ వర్కర్లకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, పండ్లు అందజేయడం జరిగింది.




అదే విధంగా చేనేత కార్మికులు, దర్జీలు, మంగళ వాయిద్యాలు వాయించే నాయీ బ్రాహ్మణులు, కుమ్మరులు, కమ్మరులు, రైతులు తదితర వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ వారి గౌరవించాలని,సమాజహితం కోసం వారి ఆరోగ్యలను పణంగా పెట్టి పని చేస్తున్న జీవీఎంసీ శానిటరీ వర్కర్స్ని సత్కరించటం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కొండపల్లి సతీష్ బాబు, జిల్లా మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి చావలి సుబ్బలక్ష్మి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డీ నాగరాజు గారు, మండల కార్యవర్గ సభ్యులు శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, శ్రీ సింహాద్రి చంద్రభాషణరావు గారు, శ్రీ కానూరు కృష్ణ గారు, శ్రీ తంగేళ్ల ఆనంద్ గారు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments