విశాఖపట్నం -ఈరోజు అనగా తేదీ 24.09.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు సైక్లోన్ సందర్భంగా లోతట్టు ప్రాంతాలన్నీ నిన్న మరియు ఈరోజు సందర్శించి వైద్యులను, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం చేశారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిన్న అర్ధరాత్రి 01:00 గంట వరకు లోతట్టు ప్రాంతాలన్నీ సందర్శించారు. ఈరోజు సాగర్ నగర్, చేపలుప్పాడ పట్టణ ఆరోగ్య కేంద్రములను సందర్శించి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలలో మరియు లోతట్టు ప్రాంతాలలో ప్రజలందరకూ ఆరోగ్య నిమిత్తం భరోసా కలుగచేసారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఎపిడిమిక్ విభాగం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్తితులను సమీక్షిస్తూ వైధ్యాదికారులను, ఆరోగ్య సిబ్బందిని తగు సూచనలు చేయడం జరుగుతుంది. సిబ్బంది ఎవరూ సెలవులపై వెళ్ళరాదని ఆదేశించడం జరిగింది. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ప్రతీ వైధ్యాదికారిని ఆదేశించడం జరిగింది. మరియు జిల్లా ప్రోగ్రాం అధికారులందరిని తమకు కేటాయించిన పట్టణ/ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను మరియు సిబ్బందిని పర్యవేక్షించాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎ.ఎన్.ఎం లు మరియు ఆశా కార్యకర్తలు గృహ సందర్శన చేసి ఆరోగ్య సమస్యలు నివారించడం తో పాటు అవసరమైన వారికి సమీప ఆరోగ్య కేంద్రములో చికిత్స అందేవిదంగా చూడాలని ఆదేశించారు. ఈ సందర్శనలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ బి.నాగభూషణం వారు మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం


0 Comments