విశాఖపట్నం -సముద్ర వ్యర్ధాలను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డైవర్లతో సీఎం ముఖాముఖి.
• చేపల వేటతో పాటు సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరణతో లభించే ప్రొత్సాహంతో తమకు అదనపు ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రికి తెలిపిన మత్స్యకారులు.
• సముద్ర ఉపరితలంలో సేకరించిన వ్యర్థాలను డిజిటల్ తూకం వేసే విధానాన్ని పరశీలించిన సీఎం చంద్రబాబు.
• సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ ద్వారా లభించే ప్రొత్సాహకాన్ని మత్స్యకారులకు అందించిన ముఖ్యమంత్రి.
• *సముద్ర గర్భంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పాత వలలు తొలగిస్తున్న విధానాన్ని స్కూబా డైవర్లను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.*
• *సాగర స్వచ్ఛతలో భాగంగా ఏకంగా 1,200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎంకు వివరించిన అధికారులు.*
• మ్యాన్‌హోళ్లు, మురుగు కాల్వల శుభ్రత కోసం జీవీఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సీవరేజ్ రోబో పనితీరును ప్రదర్శనశాలలో పరిశీలించిన సీఎం.
• జీవీఎంసీ సాగర స్వచ్ఛత ప్రాజెక్టుకు లభించిన గ్లోబల్ గుర్తింపు, భవిష్యత్తు లక్ష్యాలపై బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధులతో చర్చించిన ముఖ్యమంత్రి.
• *సాగర తీరంలో మురి మిక్చర్ విక్రయించే మహిళ జీవనోపాధి గురించి అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.*
• *ఆమె విక్రయించే మురిమిక్చర్‌ను ఆస్వాదించిన చంద్రబాబు.*
• *మురి మిక్చర్ విక్రయించే మహిళ ఒంటరి మహిళ అని తెలుసుకున్న సీఎం, ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు ఆదేశం.*

0 Comments