ఫిల్మ్ నగర్ భూ కేటాయింపుపై సీఎం హామీ*


విశాఖపట్నం, సెప్టెంబర్ 19:_ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కు భూమి కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, పి. విష్ణు కుమార్ రాజులు సీఎం చంద్రబాబు నాయుడుకు శనివారం వినతి పత్రాన్ని అందించారు. 2014 - 19 టీడీపీ ప్రభుత్వ హయంలో ఫిల్మ్ నగర్ కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు తిమ్మాపురంలో 5 ఎకరాల భూమి కేటాయించారు. అయితే ఆ ఉత్తర్వుల్లో కొన్ని సాంకేతిక అంశాలు పేర్కొనకపోవడం వల్ల ఆ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. సాంకేతిక అంశాలు సరి చేస్తూ జీఓ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే హోదాలో గంటా గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లను ప్రత్యేకంగా కలిసి కోరారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి విశాఖ వచ్చిన సీఎం దృష్టికి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ భూ కేటాయింపు విషయం ఎమ్మెల్యేలు మరోసారి తీసుకువెళ్లగా ఆయన తన కార్యదర్శి ప్రద్యుమ్నతో మాట్లాడారు. వెంటనే భూ కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని ప్రద్యుమ్నకు సీఎం సూచించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ భూ కేటాయింపు వేగవంతం చేయాలని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సంబంధిత అధికారులకు జారీ చేసిన లేఖను జత చేసి సీఎంకు అందజేశారు.


Post a Comment

0 Comments